యూఏఈ టూ ఇండియా..దుబాయ్ కు రానున్న 'ఐఎన్ఎస్ శార్దుల్'
- May 07, 2020
యూఏఈ: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకెళ్లే 'వందే భారత్ మిషన్' కార్యక్రమం నేటి నుండి ప్రారంభమయింది. ఇంతకుముందే అబుధాబి, దుబాయ్ నుండి రెండు ఎయిర్ ఇండియా విమానాలు కేరళకు బయలుదేరాయి. మరోపక్క నావికాదళం సైతం 'సముద్ర సేతు' కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా మాల్దీవుల్లో చిక్కుకున్న దాదాపు 1,000 మంది భారతీయులను కేరళకు తీసుకెళ్లేందుకు 'మాలే' పోర్టుకు 'ఐఎన్ఎ జలశ్వా మరియు మాగర్' గురువారం ఉదయం చేరుకున్నాయి.
దుబాయ్ కి రానున్న 'ఐఎన్ఎస్ శార్దుల్':
గల్ఫ్ దేశాలలో చిక్కుకున్నవారిని తీసుకురావడానికి మొత్తం 14 నౌకలను సిద్ధంగా ఉంచారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ ఐన తక్షణం ఇవి రంగంలోకి దిగనున్నాయి. ఈ నౌకల్లో ఎక్కువమంది ప్రయాణించేందుకు అదనపు చోటు కల్పించేందుకు అత్యవసరం లేని వస్తువులను తీసేయటం జరుగుతోంది. ఈ నౌకల్లో సామాజిక దూరం మరియు పరిశుభ్రత వంటి నిర్దేశించిన ప్రామాణిక ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సదరన్ నావల్ కమాండ్‌కు అనుబంధంగా ఉన్న 'ఐఎన్ఎస్ శార్దుల్' సైతం ఈ ఆపరేషన్ కు తోడైంది మరియు దుబాయ్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు దీనిని నియమించటం జరిగింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!