మక్కాలోని పవిత్ర మసీదు వద్ద స్వీయ స్టెరిలైజేషన్ గేట్ల ఏర్పాటు

- May 07, 2020 , by Maagulf
మక్కాలోని పవిత్ర మసీదు వద్ద స్వీయ స్టెరిలైజేషన్ గేట్ల ఏర్పాటు

సౌదీ: కరోనావైరస్ వ్యాప్తికి అరికట్టే చర్యల్లో భాగంగా మక్కాలోని పవిత్ర మసీదులో అధునాతన స్వీయ-స్టెరిలైజేషన్ గేట్లను ప్రారంభించింది సౌదీ ప్రభుత్వం. మసీదు ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ గేట్లు, క్రిమిసంహారక మందులను పిచికారీ చేయటమే కాకుండా ఆరు మీటర్ల దూరంలో ప్రవేశించేవారి ఉష్ణోగ్రతను తనిఖీ చేయడానికి థర్మల్ కెమెరాలతో అమర్చబడ్డాయి. ఈ గేట్లు ఒకే సమయంలో అనేక మంది వ్యక్తుల ఉష్ణోగ్రతను ప్రదర్శించే స్మార్ట్ స్క్రీన్లతో పాటు నిఘా మానిటర్లను కలిగిఉంటాయి. మసీదులోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని  పాటిస్తూ ఈ గేట్ల గుండా వెళ్ళాలి అని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com