కువైట్ నివాసితులకు షాక్...
- May 08, 2020
కువైట్ లో స్థిరపడ్డ భారతీయులను ఇక్కడ నుంచి స్వదేశానికి తరలించే ప్రక్రియ కుంటుపడింది. వందేభారత్ మిషన్ లో భాగంగా భారతీయులను స్వదేశానికి శుక్రవారం నుంచి పంపాలన్న నిర్ణయం అమలులో జాప్యం జరుగుతోంది. అందిన సమాచారం ప్రకారం అనుకున్న సమయానికి కువైట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించకపోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి కువైట్ నుంచి 5 విమాన సర్వీసులు హైదరాబాద్, కొచ్చి, చెన్నై, అహ్మదాబాద్, కోజికోడ్ లకు పంపాల్సి ఉంది. అయితే ఇప్పటికీ దానికి సంబంధించిన అనుమతి రాలేదు. అక్రమంగా నివసిస్తున్న వేలాదిమంది భారతీయులను తమదేశానికి తిరిగి తీసుకువెళ్లాలని గతంలోనే భారత ప్రభుత్వాన్ని కువైట్ కోరింది. అయితే, ఇప్పటికీ భారత్ నుంచి ప్రతిస్పందన రాలేదని కువైట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!