ఫొటోగ్రఫీపై నిషేధం విధించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- May 13, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, హెల్త్ ఫెసిలిటీస్‌లో ఫొటోగ్రఫీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు లేదా విజిటర్స్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌కి సంబంధించిన ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఫొటోలు తీయడం నిషేధమని మినిస్ట్రీ స్పష్టం చేసింది. వ్యక్తుల ప్రైవసీ, భద్రత వంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మినిస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ నిషేధాన్ని పరిగణనలోకి తీసుకుని, అప్రమత్తంగా వుండాలని మినిస్ట్రీ హెచ్చరించింది. హెచ్చరికల్ని బేఖాతరు చేస్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మినిస్ట్రీ వెల్లడించింది.
--దివాకర్(మా గల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







