రెండో విడతగా 89 మంది ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులకు సాయం
- May 19, 2020
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా రంగానికి చెందిన సినీ పాత్రికేయులు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. ప్రతీరోజు ప్రెస్ మీట్స్ లో బిజీగా ఉండే సినీ పాత్రికేయులు కూడా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారికి ఆసరాగా నిలవలన్న ఉద్దేశ్యంతో సభ్యులందరికీ అసోసియేషన్ ద్వారా దాదాపు మెంబర్లు అందరికీ పోన్లు చేసి ఎలాంటి తారతమ్యం లేకుండా, వద్దన్న వారిని వదిలేసి కమిటీ సభ్యుల సహకారంతో గత నెల ఏప్రిల్ 13వ తేదీన 87 మంది మెంబర్స్ కి ఐదువేల రూపాయలు చొప్పున వారి అకౌంట్ లోకి నెప్టీ ద్వారా ట్రాన్స్ పర్ చేసిన విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన సి సి సి ద్వారా నిత్యావసర సరుకులు కూడా సినిమా జర్నలిస్టులకు అందించడం జరిగింది. ఇప్పుడు లాక్‌డౌన్ మే నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులకు మళ్లీ ఈసారి మూడు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని కమిటీ సభ్యులు తీర్మానించుకుని వద్దన్న వారిని వదిలేసి 89 మంది సభ్యులకు మంగళవారం రోజు వారి అకౌంట్ కు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున నేఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
ఈసందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ కొండేటి మాట్లాడుతూ, ` కమిటీ సభ్యులందరి సహాయ సహకారాలతో రెండో విడతగా ఈరోజు అనగా గా మంగళవారం నాడు వద్దన్న వారికి వదిలేసి 89 మంది మెంబర్స్ కి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున పంపించాం. సినిమా ఇండస్ర్టీలోని 24 క్రాప్ట్స్ కి ఎప్పుడూ ముందుండి వారి గురించి ప్రజలకు చేరవేసేది మా సినీ పాత్రికేయ కుటుంబమేనని చెబుతూ మీరు సినీ కార్మికుల సంక్షేమం కోసం చేసే మంచి పనుల విషయంలో సినీ పాత్రికేయులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ` అని అన్నారు.
జనరల్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ` సమిష్టిగా అందరూ కలిసి పనిచేస్తున్నాం. కమిటీ సభ్యులందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి విపత్తు ఎప్పుడూ రాకూడదని కోరుకుంటున్నాను` అని అన్నారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులైన 89 మందికి ట్రాన్స్ఫర్ చేయమని రెండు చెక్కుల రూపంలో రెండు లక్షల 67 రూపాయలు చెక్కులను ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ టి సీతారాములుకి ప్రెసిడెంట్ సురేష్ కొండేటి జనరల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి ట్రెజరర్ భూషణ్ కమిటీ సభ్యులు సాయి రమేష్ గౌరవ సలహాదారు లక్ష్మణరావు అందించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







