కరోనా వైరస్ ఇంపాక్ట్: ఎతిహాద్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగుల ‘లే ఆఫ్’
- May 20, 2020
అబుధాబి:ఎతిహాద్ ఎయిర్‌వేస్, తమ సంస్థకు సంబంధించిన పలు యూనిట్స్‌లో ఉద్యోగులకు ‘లే ఆఫ్’(తీసివేయుట)ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎయిర్ ట్రావెల్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకుంది. తమ వర్క్ ఫోర్స్ విషయంలో చాలా గర్వంగా ఫీలవుతున్నామనీ, అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించాల్సి వస్తోందని ఎతిహాస్ అధికార ప్రతినిది¸ ఒకరు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితుల కారణంగా తమ విమానాల రాకపోకలు నిలిచిపోయాయనీ, ప్రత్యేక విమానాల్ని మాత్రం నడుపుతున్నామని సంస్థ పేర్కొంది. గత ఏడాది 20,500 మందికి ఉద్యోగాలు కల్పించిన సంస్థ, ఈ ఏడాది వందలాది మందిని తొలగించాల్సి వచ్చింది. వీరిలో క్యాబిన్ క్రూ మెంబర్స్ కడూఆ వున్నారు. మరిన్ని ఉద్యోగాల తొలగింపు కూడా తప్పకపోవచ్చునని సంస్థ చెబుతోంది. అయితే, భవిష్యత్తుపై ఆశతో వున్నామని అంటోంది ఎతిహాద్.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







