BREAKING..కరోనా: ముందు జాగ్రత్తలు పాటించనందుకు మూతబడ్డ అమెర్ కేంద్రం

- May 20, 2020 , by Maagulf
BREAKING..కరోనా: ముందు జాగ్రత్తలు పాటించనందుకు మూతబడ్డ అమెర్ కేంద్రం

దుబాయ్: యూఏఈ లో ఆంక్షలు సడలించినా, తగిన జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ప్రజలు బయట తిరగవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో అన్ని కార్యాలయాలు సైతం తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. అనుసరించాల్సిన భద్రతా చర్యలను పాటించడంలో విఫలమైనందుకు 'అల్ రిగ్గట్ అల్ బుటీన్' లోని ఒక అమెర్ కేంద్రాన్ని మూసివేసినట్లు దుబాయ్ ఎకానమీ బుధవారం తెలిపింది. 

జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ & ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) చేత అధికారిక ఒప్పందం పొంది వివిధ వీసా మరియు రెసిడెన్సీ సేవలను అందించే ప్రైవేట్ కేంద్రాలే ఈ అమెర్ కేంద్రాలు.

మరి అమెర్ కేంద్రం పాటించని ఆ జాగ్రత్తలు ఏంటంటే..30 శాతం పరిమితిని మించి సిబ్బంది అక్కడ ఉండటం, వినియోగదారుల కోసం థర్మల్ స్కానర్‌లను స్థాపించకపోవడం, భౌతిక దూరపు స్టిక్కర్‌లను ప్రదర్శించకపోవడం మరియు కస్టమర్ కూర్చునే ప్రదేశాలలో దూరం ఉండేలా చూడలేకపోవడం వంటివి ఈ కేంద్రం మూసివేతకు కారణమయ్యాయి. 

ఫేస్ మాస్క్‌లు, గ్లౌజులు ధరించడం, సామాజిక దూరాన్ని నిర్ధారించడం వంటి కోవిడ్ -19 ముందు జాగ్రత్త చర్యలకు కట్టుబడి ఉండాలని దుబాయ్ ఎకానమీ వ్యాపారులను ఆదేశించింది.

ఏదైనా కార్యాలయం పైన సూచించిన జాగ్రత్తలు పాటించకపోతే ప్రజలు 600545555 కు కాల్ చేయడం ద్వారా లేదా www.consumerrights.ae వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఆపిల్, గూగుల్ మరియు హువావే స్టోర్స్‌లో లభించే దుబాయ్ కన్స్యూమర్ యాప్ ద్వారా కూడా ప్రజలు ఫిర్యాదు చేయటానికి వీలవుతుందని దుబాయ్ ఎకానమీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com