కువైట్‌లో భారతీయులను స్వస్థలానికి రప్పించండి:మిధున్ రెడ్డి
- May 20, 2020
పులివెందుల:లాక్‌డౌన్ కారణంగా కువైట్‌లో ఉన్న భారతీయులను సురక్షితంగా భారత్కు రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జయశంకర్‌కు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మంగళవారం లేఖ రాశారు. కువైట్‌లో వీసాల గడువు మించిపోతున్న భారతీయులు దాదాపు 10వేల మంది ఉన్నారన్నారు. వారిని కువైట్ ప్రభుత్వం సొంత ఖర్చులతో భారత్కు పంపేందుకు సిద్ధంగా ఉందన్నారు.
భారత్ కు సంబంధించిన 10వేల మంది వలస కార్మికులలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2,500మంది ఉన్నారన్నారు. అందులో ఎక్కువ మంది మహిళలు ఉన్నారన్నారు. వీరందరికి అక్కడి కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇబ్బందులు పడకుండా వారిని సొంతూళ్లకు చేర్చవలసిన బాధ్యత ఉందన్నారు. వెంటనే కువైట్‌లోని భారతీయులను ఇండియాకు తీసుకొచ్చి.. ఆయా రాష్ట్రాలకు పంపడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులను చెన్నై లేదా విజయవాడ విమానాశ్రయాలకు చేరిస్తే అక్కడ నుంచి వారిని స్వస్థలాలకు చేర్చేందుకు తమ ప్రభుత్వానికి వీలుంటుందని ఆయన కేంద్ర మంత్రికి లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు