ఆల్కహాల్ అమ్మకాలకు షరతులతో కూడిన అనుమతి
- May 21, 2020
దుబాయ్:రమదాన్ తర్వాత దుబాయ్ లైసెన్స్‌డ్ రెస్టారెంట్స్‌లో ఆల్కహాల్(మద్యం) విక్రయాలకు అనుమతినిచ్చినట్లు పోలీస్ పేర్కొంది. దుబాయ్ పోలీస్ - లైసెన్సింగ్ సెక్షన్ ఈ మేరకు మద్యం విక్రయాలపై ప్రకటన విడుదల చేసింది. ఈద్ ప్రకటన తర్వాత ఈ అమ్మకాలు అమల్లోకి వస్తాయి. బార్లలో నిల్చోవడానికి అవకాశం లేదనీ, టేబుల్స్ వద్దకు మాత్రమే మద్యం సరఫరా చేయబడాలని నిబంధన విధించారు. డిస్పోజబుల్ ప్లాస్టిక్ కప్స్‌లో మాత్రమే డ్రింక్స్‌ని సెర్వ్ చేయాల్సి వుంటుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో యూఏఈలో కేఫ్‌లు, బార్‌లు రెస్టారెంట్లను మార్చిలో మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. గత రెండు వారాలుగా అథారిటీస్ క్రమక్రమంగా వెసులుబాట్లు కల్పిస్తున్నారు. మాల్స్, షాప్‌లు, రెస్టారెంట్లు ఇప్పటికే తెరుచుకున్నాయి. గత వారమే హోటల్ బీచ్‌లను దుబాయ్ పునఃప్రారంభించింది. పబ్లిక్ బీచ్‌లు మాత్రం మూసివేయబడే వున్నాయి.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







