భారత్:వచ్చే 5 రోజులు తీవ్రంగా ఎండలు..

భారత్:వచ్చే 5 రోజులు తీవ్రంగా ఎండలు..

రాబోయే 5 రోజుల పాటు భారత దేశవ్యాప్తంగా ఎండలు మండిపోనున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ఆదివారం మధ్యాహ్నం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

తెలంగాణ,ఏ.పి రాష్ట్రాలతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాలలో ఎండలు మండిపోతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ రాజస్థాన్ రాష్ట్రాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాజస్థాన్ లోని బికనేర్ లో వచ్చే ఐదు రోజుల పాటు 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో సైతం 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని అంటున్నారు.

పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, చత్తీస్గడ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలతోపాటు కోస్తాంధ్రలో హీట్ వెవ్ తీవ్రంగా ఉంటుందని ఐ ఎం డి హెచ్చరించింది. మధ్యాహ్నం వేళల్లో ఇంటి నుంచి ఎవరు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగిన సంగతి తెలిసిందే.ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

Back to Top