2 మిలియన్ కోవిడ్ పరీక్షలు నిర్వహించిన యూఏఈ
- May 26, 2020
యూఏఈలో కోవిడ్19 పరీక్షల సంఖ్య 2 మిలియన్లు దాటింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఒవైస్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో 2.04 మిలియన్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు మినిస్టర్. మెడికల్ టీవ్స్‌ు డెడికేషన్తోనే ఇది సాధ్యమైందని మినిస్టర్ వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నట్లు చెప్పారాయన. యూఏఈ ప్రభుత్వ అధికార ప్రతినిది¸ డాక్టర్ అమ్నా అల్ దహ్హాక్ అల్ షామ్సి మాట్లాడుతూ, తాజాగా నిర్వహించిన 41,202 పరీక్షల్లో 822 పాజిటివ్ కేసులు గుర్తించినట్లు తెలిపారు. మొత్తం కేసుల సంఖ్య 30,307కి చేరుకుంది. వీరిలో 15,657 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 248 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఈద్ అల్ ఫితర్ అనూహ్యమైన పరిస్థితుల మధ్య వచ్చిందని ఆమె తెలిపారు. డాక్టర్లు, వాలంటీర్లు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో డెడికేషన్‌తో పనిచేస్తున్నారని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







