సూర్య, కార్తీ మల్టీ స్టారర్ చిత్రం..!
- May 29, 2020
ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాలకి మంచి క్రేజ్ ఉంది. ఇద్దరు హీరోలు ఒకే తెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అదే ఆ ఇద్దరు హీరోలు ఒకే ఫ్యామిలీకి చెందిన స్టార్స్ అయితే ఇక బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఇలాంటి ప్రయత్నాలు చేసేందుకు కసరత్తులు జరుగుతుండగా, తాజాగా సూర్య,కార్తీ కాంబినేషన్లో సినిమా రెడీ అయినట్టు తెలుస్తుంది.
పృథ్వీ -బిజూ మీనన్ కాంబినేషన్ లో ఇటీవలే వచ్చిన మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోశియుమ్'. అక్కడ మంచి విజయం సాధించిన ఈ సినిమానే తమిళ్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రముఖ నిర్మాత కథిరెన్. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్ లోనే సూర్య, కార్తీ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తలు కనుక నిజం అయితే అభిమానులకి కనుల పండుగే అని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. కాగా, ఇటీవల సూర్య సతీమణి జ్యోతిక, కార్తీ కలిసి తంబీ అనే తమిళ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







