మిన్నియా పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
- May 29, 2020
అమెరికాలోని మిన్నియా పోలిస్‌లో ఓ నల్లజాతీయుడి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఆ ఘటనను నిరసిస్తూ ఇవాళ వరుసగా మూడవ రోజు కూడా ఆందోళనలు చోటుచేసుకున్నాయి. మిన్నియాపోలిస్‌లో పోలీస్ స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అనేక బిల్డింగ్‌లను కాల్చేశారు. లూటీలకు పాల్పడ్డారు. కస్టడీలోకి తీసుకున్న నల్లజాతీయుడు మృతిచెందడం పట్ల స్థానికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని మిన్నసొట రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేసినా ఆందోళనలు మాత్రం ఆగలేదు. 46 ఏళ్ల జార్జ్ ప్లాయిడ్ మృతి పట్ల ఆందోళనకారులు అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.
ఓ రెస్టారెంట్లో సెక్యూరిటీ గార్డుగా పని చేసే జార్జ్ ఫ్లైడ్‌పై ఒక కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు కిందపడేసి చేతికి సంకెళ్లు వేశారు. ఇంతలో ఓ పోలీసు అధికారి జార్జ్ గొంతుపై మోకాలితో బలంగా నొక్కిపెట్టాడు. అతడు ఎంత ప్రాధేయపడినా విడిచిపెట్టలేదు. కొంతసేపటికి జార్జ్‌లో చలనం లేకపోవడంతో అతడు చనిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో విస్త్రృతంగా ప్రచారమయ్యాయి. ఈ అమానుషాన్ని ఖండిస్తూ శ్వేత, నల్లజాతీయులు నిరసన చేపట్టి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. నలుగురు పోలీసులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మేయర్ జాకబ్ ఫ్రే చెప్పారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







