భారత్:జూన్ 30వరకు లాక్ డౌన్ పొడిగింపు
- May 30, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈసారి లాక్ డౌన్ 5.0ను 30 రోజుల పాటు పొడిగించింది.కంటైన్‌మెంట్ జోన్లలో జూన్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్టు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, లాక్ డైన్ 5లో ప్రజలకు కొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. జూన్ 8 నుంచి అన్ని రాష్ట్రాల్లో ఆలయాలు, ప్రార్థనా స్థలాలు తెరుచుకోవచ్చని తెలిసింది.జూలై నుంచి పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ప్రారంభం అవుతాయని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. లాక్‌డౌక్ కారణంగా రెండు నెలలుగా మూతబడ్డ అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైళ్లు. సినిమా హాల్స్, జిమ్‌లు, బార్లు, స్విమ్మింగ్ పూల్స్, ఆడిటోరియంల ప్రారంభంపై త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అలాగే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మతపరమైన కార్యకలాపాలపై కూడా త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుందని కేంద్రం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







