తెలంగాణలో కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు
- May 31, 2020
హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. GHMC పరిధిలోనే గడిచిన 24 గంటల్లో 122 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 10, ఖమ్మంలో 9, మహబూబ్‌నగర్, జగిత్యాల, మెదక్‌లో 3 చొప్పున కరోనా కేసులు నమోదు కాగా వరంగల్ అర్బన్‌లో 2, సూర్యాపేట, నిర్మల్, యాదాద్రి, జనగాంలో ఒక్కో కేసు నమోదు అయింది. కొత్తగా ముగ్గురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ 2,698 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1428 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఆదివారం కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం 82 మంది మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ తెలిపింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







