షియా ప్రార్థనా మందిరంపై బాంబు దాడి

- January 31, 2016 , by Maagulf
షియా ప్రార్థనా మందిరంపై బాంబు దాడి

సిరియాలోని దక్షిణ డమాస్కస్‌ ప్రాంతంలో షియా ప్రార్థనా మందిరమైన సయ్యిద్‌ జీనాబ్‌ వద్ద ఆదివారం రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 30 మంది మృతి చెందినట్లు భావిస్తున్నారు. జెనీవాలో ఐరాస ఆధ్వర్యంలో జరిగే శాంతి చర్చల్లో పాల్గొనేందుకు సిరియా ప్రభుత్వం, ప్రత్యర్థులు కలిసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రార్థనా మందిరాన్ని షియా ముస్లింలు అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. జీనాబ్‌ మందిరం వద్ద జరిగిన రెండు పేలుళ్లలో ఒక దానికి కారు బాంబు కారణం కాగా రెండో దానికి కారణాలు తెలియరాలేదని సిరియాలోని మీడియా వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com