రూ.5 లక్షల సాయంపై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు..

- June 06, 2020 , by Maagulf
రూ.5 లక్షల సాయంపై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు..

చెన్నై:భారత ప్రధాని మోదీ చేత ప్రశంసలందుకుంది. ఐక్యరాజ్యసమితి వేదికను ఎక్కి ప్రసంగించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది ఈ తొమ్మదో తరగతి చదివే అమ్మాయి. సేవాతత్పరత, కష్టాల్లో ఉన్న వారిని చూసి చలించి పోయే మనస్థత్వమే ఆమెకు ప్రధాని నుంచి ప్రశంసలు దక్కేలా చేశాయి. మధురైకి చెందిన నేత్ర తండ్రి మోహన్ తో కలిసి లాక్డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రయత్నించింది. 9వ తరగతి చదువుతున్న నేత్ర చదువుకోసమని తండ్రి రూ.5 లక్షలు దాచి పెట్టారు. ఆ డబ్బుని పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం వినియోగించింది.

ఇదే విషయాన్ని నేత్ర తండ్రి మోహన్ 'మన్ కీ బాత్' లో ప్రధాని దగ్గర ప్రస్తావించారు. హెయిర్ కటింగ్ దుకాణం నడుపుతూ కూతురి చదువు కోసం రూ.5 లక్షలు దాచి ఉంచానని, ఆ డబ్బునే పేద ప్రజల కోసం వినియోగించామని చెప్పారు. దాంతో ప్రధాని మోదీ నుంచి నేత్రకు ప్రశంసలు అందాయి. ఆమె సేవాధృక్పధాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి తమ అంబాసిడర్ గా నేత్రను ప్రకటించింది. గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్ గా నేత్రను నియమిస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. త్వరలో జెనీవాలో జరిగే సమావేశంలో పేదరికం గురించి నేత్ర ప్రత్యేక ప్రసంగం ఇవ్వబోతోంది. అలాగే ఆమె విద్య కోసం లక్ష రూపాయల డిక్సన్ స్కాలర్ షిప్ ను మంజూరు చేసింది.

ఈ సందర్భంగా నేత్ర మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని ప్రశంసలతో పాటు.. ఐరాస గుర్తింపు దక్కడం, వేదిక మీద ప్రసంగించే అరుదైన అవకాశం రావడం ఆనందంగా ఉందని చెబుతోంది. అలాగే తన ప్రసంగం ఒక్క భారత దేశంలోని పేదరికం గురించే కాకుండా, ప్రపంచ దేశాల్లోని పేదరికం గురించి ఉంటుందని చెప్పింది. తమిళనాడు రెవెన్యూ మంత్రి ఆర్ బీ ఉదయకుమార్ ఇది తమకెంతో గర్వకారణమన్నారు. సేవా తత్పరతతో ముందుకు సాగే వారికి ఇలాంటి గుర్తింపు తప్పక లభిస్తుందని నేత్ర రుజువు చేసిందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com