నా ట్రస్ట్‌లోని పిల్లలందరూ కోలుకున్నారు..రాఘవ లారెన్స్
- June 06, 2020
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్‌కు సంబంధించిన ట్రస్ట్‌కు చెందిన చిన్నారులందరూ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని రాఘవ లారెన్స్ తెలిపారు. లారెన్స్ నిర్వహిస్తున్న అనాథాశ్రమంలోని 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి కోవిడ్-19 ఉన్నట్లు వైద్యులు ఇటీవల నిర్ధారించారు. ఇప్పుడు వారంతా కోలుకోవడంతో లారెన్స్ సంతోషం వ్యక్తం చేశారు.
‘నా అభిమానులు, స్నేహితులకు నమస్కారం. ఓ మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నా ట్రస్ట్‌లో ఉంటున్న కొంతమంది చిన్నారులు ఇటీవల కరోనా వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. కొవిడ్-19 నుంచి కోలుకోవడంతో తాజాగా వాళ్లని డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఎంతో సేవ చేసిన ఎస్పీ వెలుమణిగారికి, మంత్రివర్యులు జి. ప్రకాశ్‌కి, అలాగే డాక్టర్స్, నర్సులు అందరికీ కృతజ్ఞతలు. నా సేవే నా పిల్లలని కాపాడిందని భావిస్తున్నాను. నా పిల్లల కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవే దైవం..`అని అన్నారు రాఘవ లారెన్స్.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







