పవన్ 'గడ్డం బాబా' ఏనా..?
- May 23, 2015
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చేసినా ఓ ప్రభంజనం అంటారు పవన్ ఫ్యాన్స్. పవన్ అభిమానుల కోసమే కాదు సామాన్య జనం కోసం ఆలోచిస్తూ ఉంటాడు..అందులో భాగంగానే జనసేన వచ్చింది. అయితే పవన్ ఈ మధ్యన గడ్డం పెంచడం గురించి టాలీవుడ్లో ఓ చర్చ జరుగుతోంది. అసలు పవన్ ఎందుకు గడ్డం పెంచుతున్నారు...సినిమా కోసమా, లేకుంటే ఏదైనా దీక్ష చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గబ్బర్ సింగ్ గడ్డం గురించి తాజాగా మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఓ స్వామిజీ సలహా మేరకే పవన్ 42 రోజుల పాటు దీక్ష చేస్తున్నాడని... అందులో భాగంగానే గడ్డం పెంచుతున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ ఫిలింనగర్లో ఇదో హాట్ టాపిక్‌గా మారింది. పవన్‌కు అత్యంత సన్నిహితుడైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్... విశ్వంజీ భక్తుడు. ఆ స్వామిజీనే పవన్‌కు దీక్ష చేయాలని సలహా ఇచ్చారట. మరోవైపు గబ్బర్ సింగ్2 సినిమా సెట్స్ పైకి వెళ్లే టైమ్ వచ్చింది. ఆ చిత్రంలో ఓ పాత్రలో పవన్ గడ్డంతో కనిపించాల్సి ఉందని... అందుకోసమే గడ్డం బాబాగా తయారవుతున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. దీనిలో క్లారిటీ రావాలంటే మాత్రం స్వయంగా పవన్ నోరు విప్పాల్సిందే..లేదంటే ఈ గడ్డం గురించి ఇంకా ఎన్ని వార్తలు వినాల్సి వస్తుందో మరి....
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







