తెలంగాణలో మరో 191 కరోనా పాజిటివ్ కేసులు
- June 10, 2020
హైదరాబాద్:తెలంగాణలో బుధవారం 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 4,111కు చేరింది. మొత్తంగా 156 మంది ప్రాణాలు కోల్పోగా, 1,817 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 2,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొత్తగా వచ్చిన కేసుల్లో 143 GHMC పరిధిలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 11, రంగారెడ్డిలో 8, మహబూబ్‌నగర్ 4, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో 3, నగర్ కర్నూలు, కరీంనగర్ జిల్లాల్లో 2, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







