గుండమ్మ కథ ఫస్ట్ సింగిల్ రింగ్ ట్రింగ్ విడుదల
- June 12, 2020
ఆదిత్య క్రియెషన్స్ పతాకం పై ఆదిత్య, ప్రణవ్యలు జంటగా తెరకెక్కిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గుండమ్మ కథ.
లక్ష్మీ శ్రీవాత్సవ స్వీయ నిర్మాణంలో కృష్ణం రాజు దర్శకునిగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ని ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ని నెటిజన్స్ తో పాటు సాధరణ ఆడియెన్స్ కూడా విశేషంగా ఆదరించారు. ఈ నేపథ్యంలో గుండమ్మకథ చిత్ర బృందం ఈ సినిమా ఆడియో ఆల్బమ్ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సతీష్ సాధన్ అందించిన ట్యూన్స్ తో రింగ్ ట్రింగ్ అంటూ సాగిపోయో ఈ పాటకు లిరిక్స్ వేగ్నేశ్న శ్రీ విజయ అందించారు. ఈశ్వర్ ఈ పాటకు కొరియోగ్రఫి అందించారు. ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించారు. ఇక అలనాటి గుండమ్మ కథ ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిందో అంతే స్థాయిలో ఈతరం ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే రీతిన లవ్, కామెడీ, సెంటిమెంట్ తదితర అంశాలతో కూడా సన్నివేశాలు తెరకెక్కించనట్లుగా చిత్ర బృందం తెలిపింది. కరోనా నేపథ్యంలో థియేటర్స్ లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నటీ నటులు - ఆదిత్య, ప్రణవ్య, గెటెప్ శ్రీను, భాష తదితరులు
టెక్నీషియన్లు
కెమెరా - మోనీష్ భూపతి
ఎడిటర్ - ప్రవీణ్ పూడి
మ్యూజిక్ - సతీష్ సాధన్
లిరిక్స్ - వేగ్నేశ్న శ్రీ విజయ
కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే - లక్ష్మీ శ్రీవాత్సవ
నిర్మాత - లక్ష్మీ శ్రీవాత్సవ
దర్శకత్వం - లక్ష్మీ శ్రీవాత్సవ, కృష్ణం రాజు
బ్యానర్ - ఆదిత్య మూవీస్
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!