కువైట్:కువైట్ కు తిరుగు ప్రయాణమైన 650 మంది ఇండియన్ నర్సులు

- June 12, 2020 , by Maagulf
కువైట్:కువైట్ కు తిరుగు ప్రయాణమైన 650 మంది ఇండియన్ నర్సులు

కువైట్ సిటీ:కరోనా సంక్షోభానికి ముందు వివిధ కారణాలతో స్వదేశానికి చేరుకున్న ఇండియన్ నర్సులు తిరిగి కువైట్ పయనమవుతున్నారు. శుక్రవారం 350 మంది నర్సులు కువైట్ చేరుకున్నారు. మరో 300 మంది నర్సులు శనివారం నాటికి కువైట్ చేరుకుంటారు. కువైట్ ఆస్పత్రుల్లో పని చేసే వీళ్లంతా లాక్ డౌన్ తో వీళ్లంతా ఇన్నాళ్లు ఇండియాలో ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో నర్సులను తిరిగి కువైట్ తీసుకొస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ బసెల్ అల్ సబ వివరించారు. కువైట్ చేరుకోగానే నర్సులకు రెండు రోజుల జబెర్ అల్ అహ్మద్ లో బస ఏర్పాట్లు చేశామని, అక్కడే వారికి కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. టెస్టుల్లో నెగటివ్ వచ్చిన వాళ్లను తిరిగి వాళ్ల నివాస ప్రాంతాలకు తరలిస్తామని అన్నారు. ఇదిలాఉంటే కువైట్ పని చేస్తూ పలు దేశాల్లో చిక్కుకుపోయిన నర్సులు, మెడికల్ టెక్నికల్ సిబ్బందిని కూడా త్వరలోనే కువైట్ కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com