అబుధాబి:మార్చి 1 తర్వాత వీసా రద్దైన ప్రవాసీయులు ఏం చెయ్యాలి?

- June 12, 2020 , by Maagulf
అబుధాబి:మార్చి 1 తర్వాత వీసా రద్దైన ప్రవాసీయులు ఏం చెయ్యాలి?

యూఏఈలో ఉంటున్న ప్రవాసీయుల రెసిడెన్సీ వీసా గడువు మార్చి 1తో ముగిస్తే వాళ్లు ఏం చెయ్యాలి? కరోనా వైరస్ నేపథ్యంలో వీసా కాలపరిమితిని ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు పొడగించిన విషయం తెలిసిందే. మరి వీసా రద్దు అయిన వాళ్ల పరిస్థితి ఏంటి? వారికి ప్రభుత్వం ప్రకటించిన గడువు మినహాయింపు వర్తిస్తుందా? ఈ సందేహాలకు యూఏఈ పౌర గుర్తింపు అధికారుల సమాఖ్య పూర్తి స్పష్టత ఇచ్చింది. మార్చి ఒకటితో కాలపరిమితి ముగిసిన వీసాల గడువు డిసెంబర్ చివరి వరకు పొడగించిన విషయం వాస్తవమే అయినా..వీసా రద్దు అయిన వారికి మాత్రం ఈ మినహాయింపు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. కాలపరిమితి ముగిసిన వీసాదారులు, రద్దు అయిన వీసాదారులను వేర్వేరుగా పరిగణించనున్నట్లు వెల్లడించింది. మార్చి 1తో వీసా రద్దు అయిన వాళ్లు వెంటనే తమ వీసా స్టేటస్ ను మార్చుకోవాలని అధికారులు సూచించారు. కొత్త వర్క్ వీసా తీసుకోవటంగానీ లేదంటే విజిట్ వీసా తీసుకోవటం ద్వారా ప్రస్తుతానికి సమస్య నుంచి గట్టెక్కొచ్చని తెలిపింది. లేదంటే వీసా రద్దు అయిన నాటి నుంచి గ్రేస్ పిరియడ్ ముగిసే లోపల దేశం విడిచి వెళ్లాల్సిందేనని ఆదేశించింది. లేదంటే ఎన్ని రోజులు ఎక్కువగా దేశంలో ఉంటే దాన్ని బట్టి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టతనిచ్చారు. మరిన్ని వివరాలకు ఈ నెంబర్ 8005111 కు కాల్ చెయ్యగలరు లేదా అమీర్ కేంద్రాలకు వెళ్లి మీ వీసా స్టేటస్ చెక్ చేసుకోగలరు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com