దుబాయ్: ప్రవాసీయులు తిరిగి వచ్చేందుకు ఆన్ లైన్ లో అనుమతి పత్రాలు
- June 13, 2020
దుబాయ్:అర్హత కలిగిన వీసాదారులు తిరిగి వచ్చేందుకు వీలుగా యూఏఈ ప్రభుత్వం ఆన్ లైన్ లో ప్రత్యేకంగా అనుమతి పత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. లాక్ డౌన్ తో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన యూఏఈ వీసాదారులు...తిరిగి యూఏఈ రావాలనుకుంటే ఆన్ లైన్ లో లభించే అనుమతి పత్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 2 లక్షల మంది రెసిడెన్సీ వీసాదారులు తిరిగి వస్తారని యూఏఈ అంచనా వేస్తున్న విషయం తెలిసిందే. తిరుగు ప్రయాణం కావాలనుకునే ప్రవాసీయులు beta.smartservices.ica.gov.ae వెబ్ సైట్ లో అనుమతి పత్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రవాస, విదేశీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ వివరించారు. అయితే..యూఏఈకి వచ్చే ప్రవాసీయులు అంతా కరోనా టెస్టులతో పాటు 14 రోజులు నిర్బంధంలో ఉండాలన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..