లాక్డౌన్ తర్వాత షూటింగ్ జరుపుకుంటున్న మొదటి చిత్రం 'క్రష్'
- June 15, 2020
నూతన తారాగణంతో రవిబాబు రూపొందిస్తోన్న చిత్రం 'క్రష్'. ఆద్యంతం ఆసక్తికర కథనంతో సాగే ఈ చిత్రానికి సంబంధించి ఆరు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. కరోనా మహమ్మారిని నిరోధించడంలో భాగంగా లాక్డౌన్ విధించడంతో మూడు నెలల క్రితం షూటింగ్‌లు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం లాక్డౌన్ ఎత్తివేయడంతో టాలీవుడ్లో షూటింగ్‌లు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలతో పర్మిషన్ ఇచ్చింది. దీంతో డైరెక్టర్ రవిబాబు తన సినిమా 'క్రష్' షూటింగ్‌ను పునరుద్ధరించారు. లాక్డౌన్ అనంతరం టాలీవుడ్లో షూటింగ్ జరుపుకుంటున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం. నాలుగు రోజుల నుంచి రామానాయుడు స్టూడియోస్‌లో హీరో హీరోయిన్లపై రవిబాబు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వ విధి విధానాలను పాటిస్తూ, అవసరమైన టెక్నీషియన్స్‌తోనే ఈ షూటింగ్ నిర్వహిస్తున్నామని రవిబాబు తెలిపారు. మంగళవారంతో టాకీ సన్నివేశాలు పూర్తవుతాయని ఆయన అన్నారు.
"అందరూ అన్ని పనులూ, అన్ని వ్యాపారాలూ చేసుకుంటున్నారు. మన సినిమావాళ్లకు సినిమాలు తప్ప ఇంకేం తెలియదు. మనం మాత్రం మన పని ఎందుకు చేసుకోకూడదు? ప్రభుత్వ నియమ నిబంధనలు, సూచనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌లు చేసుకుందాం. అవసరమైన మేరకు మేం నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిపి 'క్రష్' సినిమా కోసం 26 మందిమి పని చేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో 12 వేలకు మంది పైగా పనిచేస్తున్నారు. షూటింగ్‌లు జరిగితేనే అందరికీ పనీ, తద్వారా ఉపాధీ లభిస్తుంది" అని రవిబాబు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







