ట్రావెల్ బ్యాన్‌ని మరో వారం పొడిగించిన అబుధాబి
- June 15, 2020
అబుధాబి:అబుధాబి లోపలికి వచ్చే అలాగే బయటకు వెళ్ళే ప్రయాణాలకు సంబంధించి ట్రావెల్ బ్యాన్‌ని జూన్ 16 మంగళవారం నుంచి మరో పొడిగించింది అబుధాబి. ఈ మేరకు సీనియర్ హెల్త్ అధికారి ఒకరు వెల్లడిస్తూ, పెద్దయెత్తున టెస్టింగ్ డ్రైవ్ చేపడ్తున్న దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.గత రెండు వారల నుంచి ఇప్పటి వరకు 3,88,000 మందికి పరీక్షలు నిర్వహించారు.
అబుధాబి సిటీ, అల్ అయిన్ మరియు అల్ దర్భా రెసిడెంట్స్ తమ సిటీల్లో ప్రయాణించవచ్చుననీ కానీ తమ నగరాల్ని విడిచి వెళ్ళే ప్రయత్నం చేయరాదని అధికారులు సూచిస్తున్నారు. జూన్ 2న ప్రారంభమైన ఈ విధానం తర్వాత, రాత్రి వేళల్లో 10 నుంచి 6 గంటల వరకు డిస్‌ఇన్ఫెక్షన్ వర్క్ జరుగుతోంది. ఎంపిక చేసిన విభాగాల్లో పనిచేస్తున్నవారికి, విమాన మార్గంలో ప్రయాణించేవారికి, ప్రత్యేక పరిస్థితుల్లో వున్నవారికి కొన్ని వెసులుబాట్లు కల్పించారు. పర్మిట్ కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యగలరు.
http://https://es.adpolice.gov.ae/en/movepermit
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







