సిమ్ కార్డ్ స్కాంలో ఐదుగురు అరెస్ట్
- June 17, 2020
రియాద్:నకిలీ సిమ్ కార్డ్ స్కాంలో సౌదీ సైబర్ క్రైం పోలీసులు ఐదుగురు యెమనీస్ ను అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఐదుగురు నిందితులు అల్ మర్కద్ జిల్లాలోని సెంట్రల్ రియాద్ ప్రాంతంలో అక్రమంగా సిమ్ కార్డ్ షాపు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫోర్జరీ గుర్తింపు కార్డులు, నకిలీ వేలి ముద్రణ యంత్రాలతో వీళ్లు పలు కంపెనీలకు చెందిన సిమ్ కార్డులను పొందినట్లు గుర్తించారు. నిందితుల నుంచి మొత్తం 652 సిమ్ కార్డులను, నాలుగు వేలి ముద్రణ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సిమ్ కార్డులు అన్ని పలువురు పౌరులు, ప్రవాసీయుల పేరు మీద యాక్టివేట్ అయి ఉన్నాయి. అరెస్టైన ఐదుగురిని తదుపరి న్యాయవిచారణకు తరలించారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







