దుబాయ్:ఇక సత్వరమే జనన, మరణ ధృవీకరణ పత్రాలు..కొత్త మార్గనిర్దేశకాలు జారీ
- June 17, 2020
దుబాయ్ ఎమిరేట్ పరిధిలో జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీలో పలు సంస్కరణలు తీసుకొచ్చింది ఆరోగ్య శాఖ. దీంతో డెత్, బర్త్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం పూర్తిగా తగ్గిపోనుంది. ఆన్ లైన్ లో సత్వరమే సర్టిఫికెట్లను ఇచ్చేలా దుబాయ్ ఆరోగ్య శాఖ కొత్త మార్గనిర్దేశకాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రైవేట్ ఆరోగ్య సంస్థలకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. జుమెరా లేక్స్ టవర్స్ లోని మెడికల్ ఫిట్నెస్ సెంటర్ (రెడ్ డైమండ్ బిల్డింగ్) లో ఏర్పాటు చేసిన స్మార్ట్ సర్వీస్ కేంద్రం ద్వారా ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక నుంచి జనన, మరణ ధృవీకరణ పత్రాలు కావాల్సిన వారు సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకొని వివిధ ప్రభుత్వ కేంద్రాల్లో ధృవీకరణ పత్రాలు పొందవచ్చు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







