తెలంగాణలో కొత్తగా మరో 269 కరోనా పాజిటివ్ కేసులు
- June 17, 2020
హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా మరో 269 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,675కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు 1,096 శాంపిల్స్ పరీక్షించినట్టు పేర్కొంది. 269 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా, 827 మందికి నెగిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వెల్లడించింది. కరోనాతో నేడు ఒకరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 192గా నమోదైంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 3,071 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 2,412 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
నమోదైన కేసుల్లో GHMC పరిధిలోనే 214 కేసులు ఉన్నాయి. మిగిలిన వాటిలో జనగామ జిల్లాలో 5, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1, కరీంనగర్ జిల్లాలో 8, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1, మహబూబ్‌నగర్ జిల్లాలో 1, మెదక్ జిల్లాలో 3, మేడ్చల్ జిల్లాలో 2, ములుగు జిల్లాలో 5, రంగారెడ్డి జిల్లాలో 13, సంగారెడ్డి జిల్లాలో 3, వికారాబాద్ జిల్లాలో 1, వనపర్తి జిల్లాలో 2, వరంగల్ అర్బన్ జిల్లాలో 10 కరోనా కేసులు ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







