భారత్ లో ఒక్కరోజే 19459 కరోనా పాజిటివ్ కేసులు
- June 29, 2020
భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర ప్రభావం చూపటంతో.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ప్రతిరోజు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,459 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఒకేరోజులోనే 380 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,48,318కి చేరింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు 16,475 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 2,10,120 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇప్పటివరకు 3,21,273 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







