కువైట్:ఆరోగ్య సిబ్బంది వారి రెసిడెన్సీ వీసా గడువు ముగిసినప్పటికీ తిరిగి రావచ్చు
- July 05, 2020
కువైట్ సిటీ:వైద్య శాఖ స్పాన్సర్ షిప్ లో పని చేస్తున్న ప్రవాస వైద్యరంగ నిపుణుల్ని కువైట్ ప్రభుత్వం సాదరంగా అహ్వానిస్తోంది. రెసిడెన్సీ వీసా గడువు ముగిసినా సరే..హెల్త్ స్టాఫ్ కువైట్ రావొచ్చని స్పష్టమైన ప్రకటన చేసింది. వైద్య శాఖలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న విదేశీ ఉద్యోగుల కరోనాకు ముందు వివిధ కారణాలతో వారి సొంత దేశాలకు వెళ్లారని కువైట్ వైద్య శాఖ వెల్లడించింది. అయితే..లాక్ డౌన్ మార్చిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో వాళ్లంతా ఆయా దేశాల్లోనే ఉండిపోయారు. అలా దాదాపు 1000 మంది డాక్టర్లు, నర్సులు, రేడియాలజి టెక్నిషియన్లు కువైట్ రాలేకపోయారు. ఇందులో ఎక్కువ మంది భారతీయులే కావటం విశేషం. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో కువైట్ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉండటంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన హెల్త్ స్టాఫ్ కు కువైట్ అహ్వానం పలుకుతోంది. రెసిడెన్సీ వీసా గడువు ముగిసినా సరే వైద్య రంగ నిఫుణులు రావొచ్చని, అలాగే తమ వెంట కుటుంబసభ్యులను తీసుకొచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?