మస్కట్:కరోనా నియంత్రణ చర్యలు పాటించకుంటే జరిమానాలు..
- July 05, 2020
మస్కట్:కరోనా కట్టడి కోసం ప్రైవేట్ సంస్థలపై ఒమన్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఫోకస్ చేసింది. మంత్రిత్వ శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలను అమలు చేయకుంటే RO500 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. కార్మికులను తరలించే సంస్థ వాహనాల దగ్గర్నుంచి కార్మికులు ఉండే గది వసతుల వరకు మార్గనిర్దేశకాలు జారీ చేసింది. సంస్థకు చెందిన ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో ఉద్యోగుల మధ్య ఒక సీటు ఖచ్చితంగా ఖాళీగా వదిలేయాలని ఆదేశించింది. లేదంటే RO300 ఫైన్ విధిస్తామని వెల్లడించింది. అలాగే కార్మికులు బస చేసేందుకు ఏర్పాటు చేసిన గదుల విషయంలోనూ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని వార్నింగ్ ఇచ్చింది. వర్కర్స్ ఉండే ప్రతి హౌసింగ్ యూనిట్స్ లో తప్పనిసరిగా రెండు గ్రూపులుగా విభజించాలని, రెండు గ్రూపులకు వేర్వేరుగా టాయ్ లెట్ వసతి కల్పించాలని సూచించింది. వసతి నిబంధనలు అతిక్రమిస్తే RO300 జరిమానా విధించనుంది. ఒక వేళ కార్మికులు కరోనా బారిన పడితే వాళ్లు ఉండేందుకు ప్రత్యేకంగా వైద్యంతో కూడిన క్వారంటైన్ సౌకర్యాన్ని కల్పించాలని, లేదంటే RO500 జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఇక కార్మికులకు కేటాయించిన గదుల్లో ప్రభుత్వం సూచించిన పరిమిత సంఖ్యలోనే కార్మికులు ఉండాలని, ఎక్కువ మంది ఉంటే బస కల్పించిన సంస్థకు RO100 ఫైన్ వేస్తామని మానవ వనరుల శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







