'అమ్మా నాన్న ఆట' సినిమా ఆగిపోయినట్టుగా కమల్ ప్రకటించారు
- February 04, 2016లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'అమ్మా నాన్న ఆట' సినిమా ఆగిపోయింది. ఉత్తమ విలన్, చీకటి రాజ్యం లాంటి సినిమాల తరువాత సూపర్ ఫాంలో కనిపించిన కమల్, అదే స్పీడులో మరో రెండు సినిమాలను ప్రకటించాడు. అమల హీరోయిన్ గా అమ్మా నాన్న ఆట అనే సినిమాను ప్రారంభించిన కమల్, తాజాగా ఆ సినిమా ఆగిపోయినట్టుగా ప్రకటించాడు. అయితే ఎందుకు ఆగిపోయింది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.టికె రాజీవ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ సినిమా ఆగిపోవటంతో ఇప్పుడు అదే దర్శకుడితో మరో సినిమాను స్టార్ చేస్తున్నాడు. కొత్త సినిమాలో రమ్యకృష్ణ, కమల్ కు జోడిగా నటిస్తుండగా కమల్ కూతురు శృతిహాసన్ సినిమాలో కూడా కమల్ కూతురి పాత్రలో కనిపించనుంది.ఓ టీవి ఛానల్ ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించిన కమల్ హాసన్ త్వరలోనే నెక్ట్స్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నాడు.
తాజా వార్తలు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!