కువైట్ లో గుండెపోటు తో మృతి చెందిన ఏ.పి వాసి
- July 21, 2020
కువైట్ సిటీ:వైఎస్ఆర్ జిల్లా పెనగలూరు మండలం ఎన్ ఆర్ పురం గ్రామానికి చెందిన దేవరపల్లి రామకృష్ణయ్య (26) ఈ నెల 10 వ తేదీన కువైట్ లోని ఖేతాన్ ప్రాంతలో గుండెపోటు తో మృతి చెందాడు.
గత 4 సంవత్సరాల నుంచి కువైట్ లో జీవనోపాధి కోరకు వచ్చి జీవనం సాగిస్తున్నారు. మృతుని తల్లి కూడా కువైట్ లోనే పనిచేసుకుంటూ వున్నారు. రామకృష్ణయ్య చనిపోయిన విషయం వారి మేనమామ రామాపురం లక్ష్మయ్య పెనగలూరు వైఎస్ఆర్సీపీ నాయకులు. కొండూరు అజయ్ రెడ్డి కి ఫోన్ చేసి విషయం తెలుపగా, కొండూరు అజయ్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి కి ఫోన్ చేసి మాట్లాడి, ఆయన దృష్టికి, తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించి మృతదేహం స్వస్థలానికి పంపించేందుకు కువైట్ లోని భారత రాయబార కార్యాలయంలో ఇమిగ్రేషన్, మరియు పేపర్ వర్క్, సేవాదల్ ఇన్చార్జ్, గోవిందు రాజు ద్వారా పనులు పూర్తి చేయించారు.మృతుని కుటుంబ సభ్యులకు తగిన ఆర్ధిక సహాయం చేసారు.మృతదేహం, చెనై విమానాశ్రయం నుంచి మృతుని స్వస్థలం ఎన్ ఆర్ పురం గ్రామానికి, చేర్చేందుకు APNRTS వారి ద్వారా ఉచిత ఎంబులెన్సు సౌకర్యం ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా రామకృష్ణయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, కొండూరు అజయ్ రెడ్డి, ముమ్మిడి బాలిరెడ్డి ,మేడపాటి వెంకట్(APNRTS ఛైర్మన్) ,బి.హెచ్ ఇలియాస్(APNRTS డైరెక్టర్) , కృతజ్ఞతలు తెలియజేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







