దుబాయ్ విమానాశ్రయాలలో పిసిఆర్ పరీక్ష నియమాల్లో మార్పు: ఎమిరేట్స్
- July 26, 2020
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకునే ప్రయణీకులు పాలిమరేస్ చైన్ రియాక్షన్ (పిసిఆర్) పరీక్ష జరిపించుకోవలసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నియమం పై కొన్ని సవరణలు చేసి ఆగస్టు 1 నుండి నిర్దిష్ట దేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు మాత్రమే తప్పనిసరి అని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ తెలిపింది.
ఆ నిర్దిష్ట దేశాల జాబితా ఇలా ఉంది:
1. ఆఫ్గనిస్తాన్
2. అర్మేనియా
3. బ్రెజిల్
4. బంగ్లాదేశ్
5. జిబౌటి
6. ఈజిప్ట్
7. ఎరిట్రియా
8. ఇండియా
9. ఇండోనేషియా
10. ఇరాన్
11. ఇరాక్
12. కజాఖ్స్తాన్
13. కిర్గిజ్స్తాన్
14. లెబనాన్
15. మోంటెనెగ్రో
16. నైజీరియా
17. పాకిస్థాన్
18. ఫిలిప్పీన్స్
19. రష్యన్ ఫెడరేషన్
20. సెర్బియా
21. సోమాలియా
22. సౌత్ ఆఫ్రికా
23. శ్రీలంక
24. సుడాన్
25 తజికిస్తాన్
26. టాంజానియా
27. తుర్క్మెనిస్తాన్
28. ఉజ్బెకిస్తాన్
29. టర్కీ
30. యునైటెడ్ స్టేట్స్ లోని పలు విమానాశ్రయాలు - యుఎస్ విమానాశ్రయాలు డల్లాస్ ఫోర్ట్ వర్త్ (డిఎఫ్‌డబ్ల్యు), హ్యూస్టన్ (ఐఎహెచ్), లాస్ ఏంజిల్స్ (లాక్స్), శాన్ ఫ్రాన్సిస్కో (ఎస్‌ఎఫ్‌ఓ), ఫోర్ట్ లాడర్డేల్ (ఎఫ్‌ఎల్‌ఎల్) మరియు ఓర్లాండో (ఎంసిఓ) - కాలిఫోర్నియా, ఫ్లోరిడా మరియు టెక్సాస్ నుండి వచ్చిన ప్రయాణీకులతో సహా.
పిసిఆర్ పరీక్ష నివేదిక తప్పనిసరి:
యూఏఈ చేరుకునే ప్రయాణికులందరూ తప్పనిసరిగా పిసిఆర్ పరీక్ష నివేదికను తమవద్ద ఉంచుకోవాలి. ప్రయాణానికి ముందు గరిష్టంగా 96 గంటలు లోపు పరీక్ష చేయించుకోవాలి. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను మరియు వైకల్యం ఉన్న ప్రయాణీకులను ఈ షరతు మినహాయింపబడుతుంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







