ఏపీలో కొత్తగా 6,051 కరోనా పాజిటివ్ కేసులు
- July 27, 2020
అమరావతి:ఏపీలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కేసుల్లో ప్రతి రోజూ రికార్డులు బద్దలవుతున్నాయి. కరోనా పరీక్షలు భారీగా చేస్తుండగా.. కేసులు కూడా అంతే స్థాయిలో నమోదవుతున్నాయి. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో మరోసారి రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,051 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 1,02,349 కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం 49,558 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం1,02,349 పాజిటివ్ కేసులకు గాను 49558 మంది డిశ్చార్జ్ కాగా, 51701 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 1090 మంది ప్రాణాలు కోల్పోయారు.
-- ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







