యూఏఈ లేబర్‌ చట్టాలకు భారతీయ ప్రతినిథుల ప్రశంస

- February 05, 2016 , by Maagulf
యూఏఈ లేబర్‌ చట్టాలకు భారతీయ ప్రతినిథుల ప్రశంస



యూఏఈ కొత్త లేబర్‌ చట్టాలను భారత ప్రతినిథుల బృందం ప్రశంసించింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త చట్టాలు కార్మికుల రక్షణ కోసం ఉపయోగపడ్తున్నాయని కొనియాడారు ప్రతినిథులు. ఏజెంట్ల మోసాల నుంచి ఈ కొత్త చట్టాలు కార్మికులకు రక్షణ కల్పిస్తాయని ప్రతినిథులు చెబుతూ, కార్మికుల రక్షణ కోసం చట్టాలు తీసుకు వచ్చిన యూఏఈ పాలకులను ప్రశంసించారు. యూఏఈలో 2.6 మిలియన్ల మంది ఇండియన్స్‌ ఉన్నారు. వీరిలో 65 శాతం మంది కార్మికులని ఫస్ట్‌ సెక్రెటరీ కమ్యూనిటీ ఎఫైర్స్‌, ఎంబసీ ఆఫ్‌ ఇండియా, యూఏఈ దినేష్‌ కుమార్‌ చెప్పారు. స్వదేశంలో ఒకరకమైన ఒప్పందం కుదుర్చుకున్న కార్మికులు, యూఏఈకి వచ్చాక ఏజెంట్ల ద్వారా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వస్తుందనీ ఈ కారణంగా యూఏఈలో వలస కార్మికులు ఇబ్బందులు పడాల్సి వస్తుందనీ, ఈ నేపథ్యంలో కొత్త చట్టాలు వారికి ఎంతగానో ఉపశమనం కల్పిస్తాయని అధికారులు చెప్పారు. భారతదేశం కూడా ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని యూఏఈ ప్రతినిథులు, అలాగే యూఏఈలో ఇండియా రాయబారి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com