రియా చక్రవర్తి పై FIR నమోదు చేసిన సీబీఐ!
- August 06, 2020
పాట్నా:సుశాంత్ సింగ్ బలవన్మరణం బాలీవుడ్ ను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులనీ ఈ కేసు విషయం లో విచారణ జరపగా ఎన్నో విషయాలు బయటికి వచ్చాయి. అంతేకాక ఈ కేసు ను సీబీఐ కి కూడా అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా సీబీఐ అధికారులు సుశాంత్ సింగ్ ప్రియురాలు అయిన రియా చక్రవర్తి పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు లో రియా తో పాటుగా మరి కొంత మంది పేర్లను సైతం సీబీఐ వారు జత చేశారు.
అయితే రియా చక్రవర్తి పై సుశాంత్ తండ్రి చేసిన ఆరోపణలు సీబీఐ సీరియస్ గా తీసుకుంది. మనీ లాండరింగ్ జరిగిన విషయం పై ఈ డి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాక తమ ఎదుట హజరు ఈ నెల 7 న కావాలని ఈ డి కోరిన విషయం తెలిసిందే. రియా చక్రవర్తి కి సుశాంత్ సింగ్ అకౌంట్ నుండి 15 కోట్ల రూపాయలు చేరినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం కాక, రియా ఆస్తుల పై కూడా ఆరా తీయనున్నరు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







