బీరూట్ పోర్టు డైరెక్టర్ అరెస్టు...
- August 07, 2020
బీరూట్: లెబనాన్ దేశ రాజధాని బీరూట్‌లో పేలుడు ఘటనకు బాధ్యుడిగా బీరూట్ పోర్టు డైరెక్టర్‌ను లెబనాన్ మిలటరీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జరిగిన పేలుడు ఘటనలో 135 మంది ప్రాణాలు విడువగా దాదాపు 5 వేల మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. అటార్నీ జనరల్ ఫాదీ అకీకీ నేతృత్వంలో పోలీసులు పోర్టు డైరెక్టర్ హస్సాన్ కోరేటమ్ని అదుపులోకి తీసుకున్నాయని ఆ దేశ మీడియా ఎన్‌ఎన్‌ఏ తెలిపింది. హస్సాన్ కోరేటమ్‌తో పాటు మరో 16 మంది కస్టడీలోకి తీసుకున్నట్టు వెల్లడించింది. వీరంతా పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచిన గోడౌన్ 12 వద్ద విధుల్లో ఉన్నారని పేర్కొంది. పేలుడుకు కారణమైన అమ్మోనియం నైట్రేట్ నిల్వల్లో గోడౌన్ 12 సిబ్బంది నిర్లక్షాన్యికి సంబంధించిన ఫొటోలు బయటికొచ్చాయని ఎన్‌ఎన్‌ఏ మీడియా తెలిపింది. పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పింది.
కాగా, మానవ తప్పిదం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు లెబనాన్ దేశాధ్యక్షుడు మిచెల్ అవున్ చెప్పారు. నిష్పక్షపాత దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు వెల్లడించారు. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వలు రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఇగోర్ గ్రెచుష్కిన్‌విగా తేలిందని, దర్యాప్తు బృందం అతన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. 1975 నుంచి 1990ల మధ్య జరిగిన సివిల్ వార్‌ను సైతం తట్టుకున్న భవనాలు, తాజా పేలుడు ధాటిని మాత్రం తట్టుకోలేక చరిత్రలో కనుమరుగయ్యేలా నేలకూలాయని లెబనాన్ వాసులు వాపోతున్నారు. దర్యాప్తులతో ఒరిగేదేమీ ఉండదని, పేలుడు పదార్థాలు పోర్టులోకి రాకుండే అడ్డుకుంటే చాలని అంటున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







