3 మిలియన్‌ దిర్హామ్ లు దోచుకున్న 8 మంది సభ్యుల గ్యాంగ్‌

- August 17, 2020 , by Maagulf
3 మిలియన్‌ దిర్హామ్ లు దోచుకున్న 8 మంది సభ్యుల గ్యాంగ్‌

యూఏఈ:ఆఫ్రికా మరియు ఆసియా జాతీయులైన 8 మంది సభ్యుల ముఠా, ఓ వ్యక్తిని కొట్టి అతని దగ్గర్నుంచి 3,585,000 దిర్హామ్ లను దోచుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల్ని అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. బాధితుడు, డబ్బుని డాలర్ల రూపంలో ట్రేడ్‌ చేయడం కోసమని బ్యాగులో పెట్టుకుని అల్‌ నహ్దా వైపుగా ఓ కార్యాలయానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు పక్కా వ్యూహంతో బాధితుడిపై దాడి చేసి, అతని నుంచి డబ్బు లాక్కుని, అక్కడినుంచి పారిపోయారు. అనంతరం, బాధితుడు సీఐడీ ఆఫీసర్‌కి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుల్ని గుర్తించి అరెస్ట్‌ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com