పరిచయ పత్రాల్ని సమర్పించిన భారత రాయబారి శిబి జార్జి

- August 17, 2020 , by Maagulf
పరిచయ పత్రాల్ని సమర్పించిన భారత రాయబారి శిబి జార్జి

కువైట్ సిటీ:కువైట్‌లో భారత రాయబారిగా నియమితులైన శిబి జార్జి, ఫారిన్‌ మినిస్టర్‌ అలాగే యాక్టింగ్‌ డిఫెన్స్‌ మినిస్టర్‌ షేక్‌ డాక్టర్‌ అహ్మద్‌ నాజర్‌ మొహమ్మద్‌ అల్‌ సబాహ్‌కు పరిచయ పత్రాల్ని సమర్పించారు. ఈ సందర్భంగా షేక్‌ డాక్టర్‌ అహ్మద్‌ నాజర్‌ అల్‌ సబాహ్‌, శిబి జార్జికి శుభాకాంక్షలు తెలిపారు. శిబి జార్జి తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఫారిన్‌ మినిస్టర్‌ హాలెద్‌ అల్‌ జరాల్లాహ్‌, అసిస్టెంట్‌ ఫారిన్‌ మినిస్టర్‌ ఫర్‌ ప్రోటోకాల్స్‌ ధారి అల్‌ అర్జన్‌ మరియు అసిస్టెంట్‌ ఫారిన్‌ మినిస్టర్‌ ఫర్‌ మినిస్టర్స్‌ ఆఫీస్‌ సలెహ్‌ అల్‌ లౌఘాని హాజరయ్యారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com