భారీ వాహనాలపై నిషేధం కొనసాగించాలని కోరుతున్న పలువురు ఎంపీలు

- February 07, 2016 , by Maagulf
భారీ వాహనాలపై నిషేధం కొనసాగించాలని కోరుతున్న పలువురు ఎంపీలు

               

రద్దీ సమయంలో రోడ్లపై నిలిచి ఉండకుండా భారీ వాహనాలపై నిషేధం కొనసాగించాలని పలువురు ఎంపీలు కోరుతున్నారు. ఈ నిర్ణయం ప్రతికూల వాణిజ్య మరియు ఆర్ధిక ప్రభావాలపై దుష్ప్రాభావం కల్గిస్తుందనే హెచ్చరికలు ఉన్నప్పటకీ, భారీ వాహనాలను రద్దీ సమయంలో నిషేధించాలని వారు కోరుతున్నారు. గత ఏడాది  ఫిబ్రవరి 23 వ తేదీన అలీ అల్ ఆరడి, మజిద్ అల్ మజిద్ , ఇస అల్  కూహేజి , అబ్బాస్ అల్ మది మరియు అబ్దుల్హైఈమ్ మురాద్ తదితర ఎంపీలు భారీ వాహనాలు , నీటి టాంకర్లు రద్దీ సమయంలో రద్దీ రహదార్లుపై అనుమతించరాదని..వాటికి అనుమతిస్తే పలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని  స్పీకర్ అహ్మద్ అల్ ముల్లాకు ఒక వినతిపత్రాన్ని అందించారు. ఈ భారీ వాహనాలను ఉదయం 6 : 30  నుంచి  7 :30 వరకు , మధ్యాహ్నం 1 : 30 నుంచి  3 : 30  మధ్య  ప్రధాన రహదార్లపై అముమతిస్తున్నట్లు ట్రాఫిక్ జనరల్ డైరక్టర్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com