పాటశాల బస్సులను ఒమాన్ ప్రజా రవాణా సంస్థ నిర్వాహించనుందా ?

- February 07, 2016 , by Maagulf
పాటశాల బస్సులను ఒమాన్ ప్రజా రవాణా సంస్థ నిర్వాహించనుందా ?

 ఒమాన్ లో అన్నీ పాటశాల బస్సులను ఒమాన్ ప్రజా రవాణా సంస్థ  నిర్వహించే అంశంపై తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు  రాయల్ ఒమాన్ పోలీస్ ' ఒమాన్ టైమ్స్ ' కు తెలిపింది. ప్రైవేటు యాజమాన్యాలకు చెందిన పాక్లు వాహనాలు ఇటీవల ప్రమాదాలకు గురికావడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నిజ్వా ప్రాంతానికి చెందిన ఒక పాటశాలకు చెందిన బస్సు విహారయాత్రకు వెళ్ళి తిరిగి వస్తూ ప్రమాదానికి గురైంది. ముగ్గురు భారతీయ పిల్లలు, మరో భారతీయ ఉపాధ్యాయుడు,డ్రైవర్ దారుణంగా రోడ్డు ప్రమాదంలోమరణించిన నేపధ్యంలో పాటశాలలు నిర్వహిస్తున్న రవాణా వాహనాల పట్ల ప్రజలు భీతిల్లుతున్న సందర్భంలో గతంలో ఒమాన్ ప్రభుత్వం యోచించిన ఒమాన్ ప్రజా రవాణా సంస్థ  నిర్వహించే అంశం ప్రస్తుతం తెర పైకి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com