ప్రధాని పేరుతో నకిలీ పథకం
- August 19, 2020
న్యూ ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో నకిలీ వెబ్సైట్ నిర్వహిస్తోన్న ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలకు బీమా అంటూ ఏకంగా ప్రధాని పేరుతో నకిలీ పథకాన్ని సృష్టించి వేల మంది నుంచి డబ్బులు కాజేశారని పోలీసులు గుర్తించారు. ‘ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన’ అనే నకిలీ వెబ్సైట్ నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించినట్లు తెలుస్తోంది.
అరెస్టయిన వారిలో బిహార్‌కు చెందిన నీరజ్ పాండే, సువేందర్ యాదవ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆదర్శ్ యాదవ్ ఉన్నట్లు తెలిపారు. వీరు నిర్వహిస్తున్న వెబ్సైట్లో ఇప్పటివరకు 15 వేల మంది ప్రజలు తమ పేరును నమోదు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పంచాయతీ స్థాయిల్లో భారీ నెట్వర్క్ రూపొందించి మోసానికి పాల్పడినట్లు స్పష్టం చేశారు.జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తొలుత www.pmsvy-cloud.in వెబ్‌సైట్‌తో ‘ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన’ నకిలీ పథకాన్ని నిర్వహిస్తున్న నీరజ్, ఆదర్శ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం ‘పీఎం శిశు వికాస్ యోజన’ను నిర్వహిస్తున్న సువేందర్ను అదుపులోకి తీసుకున్నారు.ఈ నకిలీ వెబ్సైట్ గురించి ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఇది నకిలీ వెబ్సైట్ అని, ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన పేరుతో ఏ ప్రభుత్వ పథకం లేదని పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!