దుబాయ్ లో సోను నిగమ్ షో..6 నెలల కోవిడ్ బ్రేక్ తర్వాత తొలి కార్యక్రమం

- August 19, 2020 , by Maagulf
దుబాయ్ లో సోను నిగమ్ షో..6 నెలల కోవిడ్ బ్రేక్ తర్వాత తొలి కార్యక్రమం

దుబాయ్: ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ షో 'ది లైట్' కి దుబాయ్ వేదిక కాబోతుంది. కోవిడ్ సంక్షోభం తర్వాత సోను నిగమ్ పాల్గొంటున్న లైవ్ ప్రోగ్రాం ఇదే. అంతేకాదు..దాదాపు ఆరు నెలల విరామం తర్వాత బాలీవుడ్ లో జరుగుతున్న తొలి ఈవెంట్ కూడా ఇదే కావటం విశేషం. చాలాకాలం తర్వాత జరుగుతున్న ఈవెంట్ కావటంతో సోను నిగమ్ లైవ్ షో కోసం అతని అభిమానులు ఉత్సాహం ఎదురుచూస్తున్నారు. అయితే..కరోనా నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అపరిమిత సంఖ్యలో జనాన్నిఅనుమతించటం లేదని, భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే ఇది తొలి బాలీవుడ్ లో తొలి సోషల్ డిస్టెన్స్ ఈవెంట్ గా వారు పేర్కొన్నారు. ఇదిలాఉంటే లైవ్ షో కోసం తాను కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు సింగర్ సోను నిగమ్ అన్నారు. తన షో కోసం రష్యా, యూకే నుంచి కూడా అభిమానులు వస్తున్నారని, అభిమానాలు వెల్లివిరిసే చోట ప్రదర్శన ఇవ్వటం పట్ల తాను కూడా ఉత్సాహంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కోవిడ్ కారణంగా చాలా మంది ఆర్ధికంగా నష్టపోయారు. కొంతమంది తమ ఆప్తులను కొల్పోయారు. అయితే..కష్టాల తర్వాత సంతోషం ఉంటుంది. అందుకే తన లైవ్ షోని 'ది లైట్' పేరుతో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com