హెచ్‌ఐసీసీలో 'సెలబ్రిటీ ప్లే ఆఫ్‌' నిర్వహించారు

- February 07, 2016 , by Maagulf
హెచ్‌ఐసీసీలో 'సెలబ్రిటీ ప్లే ఆఫ్‌' నిర్వహించారు

క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులను ఆదుకునేందుకు అవసరమైన నిధుల సేకరణ కోసం క్యూర్‌ ఫౌండేషన్‌ చేపట్టిన 'క్యాన్సర్‌ క్రూసేడర్స్‌ ఇన్విటేషన్‌ గోల్ఫ్‌ కప్‌ 2016' ముగిసింది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో 'సెలబ్రిటీ ప్లే ఆఫ్‌' నిర్వహించారు. సినీతారలు రకుల్‌ప్రీత్‌సింగ్‌, లక్ష్మిమంచు, మధుశాలినితోపాటు షీటీమ్స్‌ చీఫ్‌ స్వాతిలక్రా, ఐఏఎస్‌ అధికారి క్రిస్టినా చొంగ్తూ, అపోలో ఆసుపత్రి జేఎండీ సంగీతారెడ్డి విచ్చేసి సరదగా గోల్ఫ్‌ ఆటలో పాలుపంచుకున్నారు.ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డి, వ్యాపారవేత్త సప్తాలా రెడ్డి, క్యూర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు పి.విజయ్‌ ఆనంద్‌రెడ్డి, శశికళారెడ్డి పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com