కువైట్:ఓపెన్ హౌజ్ మీటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇండియన్ ఎంబసీ
- August 20, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని భారత రాయబార కార్యాలయంలో ప్రతి బుధవారం ఓపెన్ హౌజ్ మీటింగ్ నిర్వహిస్తామని కువైట్‌లోని భారత ఎంబసీ ప్రకటించిన విషయం విదితమే. ఆగస్టు 19న తొలి సమావేశాన్ని ప్రారంభించారు. భారత రాయబార కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత రాయబారి సిబి జార్జ్ మాట్లాడుతూ... కువైట్‌లోని భారతీయ సమాజం ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి సంఘం సభ్యుల సలహాలను రాయబార కార్యాలయం ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని తెలిపారు.కువైట్‌లోని భారతీయ సంఘాల కృషిని ఈ సందర్భంగా రాయబారి ప్రశంసించారు. భారతీయ ఇంజనీర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, భారతదేశంలో చిక్కుకుపోయిన వారి ప్రయాణ సమస్యలు మొదలైనవి తనకు తెలుసని చెప్పిన రాయబారి... అధికారులతో చర్చించడం ద్వారా వీటన్నింటికీ పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు.
ఇక నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఎంబసీ ప్రాంగణంలో ఈ ఓపెన్ హౌజ్ మీటింగ్ జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారత రాయబారి, కార్మిక శాఖలకు చెందిన అధికారులు, సంక్షేమ సంఘాల అధ్యక్షులు తదితరులు హాజరవుతారని స్పష్టం చేశారు. అయితే, ఇందులో పాల్గొనేందుకు ప్రవాసులు ముందుగానే http://[email protected] వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు