కేంద్రం అవార్డులు:ఏపీ రికార్డుల మోత
- August 20, 2020
విజయవాడ:రాష్ట్రంలోని సచివాలయ, వలంటీర్ల వ్యవస్థతో దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సత్తా చాటుతోంది. నేరుగా ప్రజల వద్దకే అన్ని సేవలు చేరువ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషిస్తోంది. కేంద్రం తాజాగా ప్రకటించిన స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో రికార్డు స్థాయిలో ఏపీకి పురస్కారాలు దక్కాయి. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థతో పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడింది. దీంతో స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో అత్యధిక పురస్కారాలు ఏపీకి దక్కాయి.
పరిశుభ్రత విషయంలో రాష్ట్ర ర్యాంక్ గణనీయంగా మెరుగుపడి 28వ ర్యాంక్ నుండి 6వ స్థానానికి చేరుకుంది. కేంద్రం ప్రకటించిన మొత్తం 64 అవార్డుల్లో 6 అవార్డులు రాష్ట్రానికే రావడం విశేషం. టాప్ 100 ర్యాంకుల్లో 72 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ పట్టణాలు కైవసం చేసుకున్నాయి. టాప్ 10లో ఎనిమిది మున్సిపాలిటీలు రాష్ట్రానివే ఉన్నాయి. విశాఖపట్నం 23 ర్యాంక్ నుంచి 9వ ర్యాంక్‌కు ఎగబాకింది. విజయవాడ 12 నుంచి 4వ ర్యాంక్‌కి, తిరుపతి 8 నుంచి 6వ స్థానానికి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







