గ్రాడ్యుయేట్స్‌లో 47 శాతానికే ఉద్యోగాలు

- February 07, 2016 , by Maagulf
గ్రాడ్యుయేట్స్‌లో 47 శాతానికే ఉద్యోగాలు

 గ్రాడ్యుయేషన్‌ పొదిన ఒమనీయుల్లో కేవలం 47 శాతం మందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయనీ, మిగతా 53 శాతం మందికి ఉద్యోగాలు దక్కడంలేదని మినిస్ట్రీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. సైన్స్‌, ఫిలాసఫీ, ఇంజనీరింగ్‌ చేసినవారికి ఉద్యోగులు త్వరగానే దొరుకుతున్నా, ఆర్ట్స్‌ చదివినవారికి ఉద్యోగాలు దొరకడంలేదు. ఇది ఆందోళనకర విషయమని సోషల్‌ రీసెర్చర్‌ యూనిస్‌ అలీ చెప్పారు. ఉద్యోగం కోసం జనవరిలో అప్లయ్‌ చేసుకోగా, ఏప్రిల్‌లో ఇంటర్వ్యూ జరిగిందనీ అక్టోబర్‌లో రిజెక్షన్‌కి గురయినట్లు తెలిసిందని మహమ్మద్‌ అల్‌ లవాతీ అనే ఉద్యోగార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఉద్యోగానికి 15 మందికి పైగా పోటీ పడుతుండడం, నిరుద్యోగ సమస్యను తెలియజేస్తోందని ఉద్యోగార్థులు చెప్పారు. చమురు ధరల పతనంతో వివిధ కంపెనీలు కొత్త ఉద్యోగాల కల్పన విషయంలో చొరవ చూపడంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com