రెస్టారెంట్, జిమ్ లను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ఒమన్
- August 26, 2020
ఒమన్:కరోనా వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ ఆరో దశ అన్ లాక్ కు సిద్ధమైంది. ఇందులో భాగంగా కేఫ్ లతో పాటు..బార్బర్ షాప్స్, బ్యూటీ పార్లర్స్, హటల్స్ లోని కాన్ఫరెన్స్ రూమ్స్, జిమ్ లను వచ్చే బుధవారం నుంచి ప్రారంభించనున్నారు. అలాగే ఒంటెల రేసులు, జెట్ స్కిట్స్, వివాహ సంబంధిత సేవలు, సంప్రాదాయ క్లినిక్కుల ప్రారంభానికి కూడా సుప్రీం కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..ఒంటెల రేసులను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని షరతులు విధించింది.అలాగే రెస్టారెంట్ల నిర్వహణలో పలు జాగ్రత్తలను సూచించింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా అనుసరించాల్సిన అన్ని మార్గనిర్దేశకాలను ఖచ్చితంగా బాటించాలని, రెస్టారెంట్లలో భౌతిక దూరం పాటించాలని హెచ్చరించింది. అయితే..కేఫ్ లలో హుక్కా సర్వీసులను మాత్రం అనుమతించటం లేదని, తర్వాతి ఆదేశాలు వచ్చే వరకు కేఫ్ నిర్వాహకులు హుక్కా సర్వీసులను ప్రారంభించొద్దని స్పష్టత ఇచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







